గుకలాంలో పైలాన్ ఆవిష్కరించిన సీఎం..
Ens Balu
3
గుకలాం
2020-12-30 17:04:02
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడానికి గుంకలాం గ్రామానికి చేరుకున్నారు. పేదలందరికీ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి విజయనగరం జిల్లా విజయనగరం నియోజక వర్గం గుకలాం గ్రామంలో ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ తో పాటు తొలిదశ నిర్మించనున్న ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి జగనన్న కాలనీ లేఅవుట్ లో ఏర్పాటు చేసిన పైలాన్ ను ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పైలాన్ వద్ద నిర్మించిన మోడల్. నమూనా గృహాన్ని తిలకించారు ఈ పైలాన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్య మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మునిసిపల్, రూరల్ డెవలప్మెంట్ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, రెవెన్యూ,భుపరిపాలనా శాఖా మాత్యులు ధర్మాన కృష్ణా దాస్, దేవాదాయ శాఖా మాత్యులు మంత్రి వెళ్ళంపల్లి శ్రీనివాస్, పర్యాటక శాఖా మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖా మంత్రి శ్రీ రంగనాధ రాజు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, ముఖ్య మంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘరాం,జిల్లా కలెక్టర్ ఎం. హరి జవహర్ లాల్, విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.