నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు..


Ens Balu
3
Narsipatnam
2020-12-30 17:23:00

 నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా   బుధవారం నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం గ్రామీణ ప్రాంతానికి చెందిన వేములపూడి , అమలాపురం, మెట్టపాలెం , చెట్టుపల్లి గ్రామపంచాయతీలలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభివృద్ధి కొరకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వైయస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారన్నారు. సొంత ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని, అంతేకాకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు.          నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లడుతూ  అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. చెట్టుపల్లి గ్రామంలో 230 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంకా కొందరు ఇంటి స్థలాలు రాలేదని తనకు కంప్లైంట్ ఇస్తున్నారని, ఈ రోజే తాసిల్దారు , వీఆర్వోల తో ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులై తే తప్పనిసరిగా వెంటనే ఇంటి స్థలాల మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
సిఫార్సు