లబ్ధిదారులందరికీ ఇళ్లు, ఇంటి పట్టాలు అందాలి..


Ens Balu
3
Kadiam
2020-12-30 18:43:48

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, చిట్టచివరి లబ్ధిదారులు వరకు  ఇళ్ల స్థలాలు , ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు కొండ గుంటూరు, కడియం గ్రామాలలో పర్యటించి భూసేకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో  స్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన అందరికీ నివాసయోగ్యమైన స్థలాలను భూసేకరణ  ద్వారా సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లు,ఇంటి స్థలాలు అందాలన్నారు. ఈ విషయంలో ఎవరు అలక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అందరు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పాటుపడాలని ఆమె సూచించారు. ఈ పర్యటనలో కడియం తాహసిల్దార్ జి భీమారావ్, రాజానగరం తహసిల్దార్ బాలసుబ్రమణ్యం, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విఆర్వో లు పాల్గొన్నారు.
సిఫార్సు