పర్వత ఆరోగ్యం కోసం మసీదులో నమాజులు..
Ens Balu
1
Annavaram
2020-12-30 20:50:04
ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పుట్టిన రోజును పురస్కరించుకుని సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యములతో కల కాలం ప్రజా సేవలో జనరంజకంగా రాణి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉండాలని దేవుని వేడుకున్నారు. బుధవారం శంఖవరం మండలం అన్నవరంలోని మసీదు (అబు బకర్) లో హ్యూమన్ రైట్స్ మిషన్ సభ్యులు ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం నమాజ్ అనంతరం "దుఅ" (దేవుని కోరుట) చేసారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు షేక్ సయ్యద్, షేక్ ఉమర్ భాష, షేక్ సుభాన్, మొహమ్మద్ రఫీ, సయ్యద్ రోషన్, షేక్ ఆలీషా, షేక్ అబ్దుల్లా, హ్యూమన్ రైట్స్ మిషన్ రాష్ట్ర సభ్యులు ఇండుగపల్లి నూకరాజు, అబ్బిరెడ్డి నారయణ రెడ్డి, మాకినీడి నాగసత్యనారాయణ, పెద్దింటి లక్ష్మణరావు, గంపల రాజు, షేక్ సత్తార్, షేక్ సుభాన్, షేక్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు.