రామతీర్థం దుర్ఘటనకు మంత్రి బాధ్యత వహించాలి..
Ens Balu
2
Gajuwaka
2020-12-31 13:51:21
విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టుకొని అరెస్టు చేయాలని గాజువాక బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్జి నరసింగరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం గాజువాక తహశీల్దార్ కార్యాలయం ముందు రామతీర్ధం నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కెఎన్ఆర్ మాట్లాడుతూ, రామతీర్థంలో తక్షణమే నూతన రాముని విగ్రహాన్ని వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. రాష్ట్రంలో తరచూ హిందూదేవాలయాలపై దాడులకు నైతిక బాధ్యతలహించి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారుకి వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు గోలి.శంకరరావు,డా.గొర్లె.సత్యనారాయణ ,సిరసపల్లి .నూకరాజు , డా.శేషుప్రసాద్,నాగేశ్వరరావు,రమనరావు, బొండా.యల్లాజీ ,పావని,వర్రి.లలిత ,జిలకర్ర.భువనేశ్వరి,రోహిణి, తారావు, బొండా.శ్రీదేవి, సూరిబాబు, కృష్ణంరాజు, పుష్పలత, రామునాయుడు, కృష్ణ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.