అప్పన్నకు పూజలు చేసిన అవంతి దంపతులు..
Ens Balu
4
Simhachalam
2021-01-01 20:49:33
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు సింహాచలం అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని అనంతరం కప్ప స్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలు శుభిక్షంగా ఉండాలని, కరోనా వైరస్ పూర్తిస్థాయిలో నియంత్రణ జరగాలని స్వామివారిని వేడుకున్నట్టు కోరుకున్నట్టు చెప్పారు. నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు,ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.