సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి..
Ens Balu
1
Gudibanda
2021-01-02 18:21:58
అనంతపురం జిల్లాలోని గుడిబండ మండల కేంద్రంలోని 1వ గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గూగుల్ మ్యాప్ లో గుడిబండ 1వ గ్రామ సచివాలయాన్ని మ్యాపింగ్ చేశారా లేదా ఆరా తీశారు. అనంతరం గ్రామ సచివాలయంలో రిజిస్టర్ లను పరిశీలించారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సచివాలయ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు సచివాలయం ద్వారా ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్క సర్వీసులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, గుడిబండ ఎంపీడీవో నాగేంద్ర కుమార్, ఈ ఓఆర్డీ నాగరాజు నాయక్, వెల్ఫేర్ అసిస్టెంట్ గోవిందరాజులు, డిజిటల్ అసిస్టెంట్ రాజు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.