పంచాయతీ నిధులు బొక్కిన వారిపై వేటుకి సిద్దం.. ఈఎన్ఎస్ లైవ్ కధనాలకు స్పందన


Ens Balu
3
s.rayavaram
2021-01-04 18:32:58

విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండలంలో సచివాలయ నిధులు  రూ.10 లక్షల ను వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు అడ్డగోలుగా దారి మళ్లించుకున్న ఈఓపీఆర్డీ మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలపై వేటు వేయడానికి జిల్లా పంచాయతీ అధికారులు రంగం సిద్ధం చేశారు.  ఈఓపీఆర్డీ త్రిమూర్తులు స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసిన చోట జరిగిన చేసిన అవినీతి వ్యవహారాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా బాహ్య ప్రపంచానికి ఆధారాలతో సహా తెలియజేసింది. దీనితో ఈఎన్ఎస్ లైవ్ కథనాల ఆధారంగా ఏ.ఎల్ పురం, ఎస్.రాయవరం మండలంలోని పలు సచివాలయాల్లో పనిచేసిన కాలంలో కూడా త్రిమూర్తులు అవినీతికి పాల్పినట్టు  ఇటు కలెక్టర్ కు, డిపీఓ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు సుమారు 50 ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన విశాఖజిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి త్రిమూర్తులు మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిల అవినీతి పై విచారణకు ఆదేశించారు. వెంటనే వీరి అవినీతిపై నర్సీపట్నం డిఎల్పీఓ శిరిషారాణి విచారణ చేపట్టి నివేదికు డిపీఓకు అందించారు. ఆపై దానిని కమిషనర్ కు డిపిఓ నివేదించడం, అవినీతి జరిగినట్టు రుజువు కావడంలో సదరు సచివాలయ సిబ్బందిపై వేటు వేయడానికి చార్జిషీటు వేయాల్సిందిగా కమిషనరేట్ నుంచి డిపిఓకు ఉత్తర్వులు అందాయి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కుడా పచ్చజెండా ఊపడంతో అక్రమార్కులపై వేటువేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు డిపీఓ క్రిష్ణకుమారి ఈఎన్ఎస్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. వాస్తవంగా ఈఓపీఆర్డీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్ కు లేదు. దీనితో అతను చేసిన అవినీతిపై చార్జిషీట్ ద్వారా కేసు ఫైల్ చేశారు. ఈఓపీఆర్డీ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా, విచారణ నివేదికను పక్కదారి పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కుల పాచికలు పారలేదు. ఎట్టకేలకు పంచాయతీరాజ్ కమిషనర్ చర్యలకు ఉపక్రమించడంతో వారిపై వేటు అనివార్యమైంది. పంచాయతీ నిధులు కాజేసిన ఈఓపీఆర్డీ త్రిమూర్తులు   పాయకరావుపేట నియోజకవర్గంలో యాక్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఒక చోటా నేతతో అధికారుల ద్వారా తనపై వేటు తప్పించుకోవాలని చూస్తున్నట్టుగా నియోజవకర్గంలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి తేడా వ్యవహరాలు చేస్తున్నందుకు ఇప్పటికే ఎమ్మెల్యే అతనిని దూరంగా పెట్టారు కూడా అయినా తన మాటకు విలువ వుందంటూ సదరు యాక్టింగ్ ఎమ్మెల్యే తన హవాని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని విజయవాడ కమిషనరేట్ స్థాయిలో పైరవీలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిధుల దుర్వినియోగం విషయంలో పక్కాగా ఆధారాలు ఉండటంతో అవినీతి ఈఓపీఆర్డీ, మరో ఇద్దరు సిబ్బందిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.