సంబర జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి..


Ens Balu
4
Sambara
2021-01-05 17:58:57

సంబర పోలమాంబ జాతరలో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖర్ ఆదేశించారు. మంగళవారం శంబర గ్రామాన్ని ఐ టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి. కూర్మనాధ్ తో కలసి సబ్ కలెక్టర్ విధేఖర్  సందర్శించారు.  ముందుగా చదురు గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.ఎల్.నగేష్ కండువాలతో ఇద్దరు అధికారులను సత్కరించారు.  అనంతరం చదురు గుడిలో  భక్తులరాకపోకలను అడిగి తెలుసుకున్నారు.  జాతరలో క్యూలైన్లు ఏర్పాటు, టికెట్ కౌంటర్ ఏర్పాటు, ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు వివరాలను ఆలయ ఈ వో ని అడిగితెలుసుకున్నారు.  చదువు గుడి వెనుక అమ్మవారి గుడిని అనుసరించి వున్న ఖాళీ స్థలాన్ని జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా తీసుకోవాలని ఆదేశించారు.  అనంతరం నీలాటిరేవుని పరిశీలించారు.  నీలాటిరేవు ప్రాంతమంతా తీవ్రదుర్గంధం వెదజల్లుతూ , పారిశుద్ద్యం పేరుకుపోవడంతో సబ్ కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.  పక్కనే వున్న గ్రామ కార్యదర్శిని పిలిచి తక్షణమే పారిశుద్ద్య పనులు చేపట్టాలని ఆదేశించారు.  ఎంతో పెద్ద జాతర జరుగుతున్న గ్రామంలో పారిశుద్ద్యం అధ్వానంగా ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  తదుపరి అమ్మవారి చదురు గుడి వెనుక గల జాతర స్తలాన్ని పరిశీలించారు.  జాతరలో క్యూలైన్లు ఏర్పాటు, ఉచిత దర్శనాన్ని పరిశీలించారు.  జాతరలో క్యూలైన్లు ఏర్పాటు, ఉచిత దర్శనం వివరాలు అడిగి తెలుసుకున్నారు.  తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ప్రస్తుతమున్న మరుగుదొడ్ల పనితీరుపై,  కేశఖండన ప్రదేశానికి సంబందించిన వివరాల పై ఆరా తీశారు..  జాతరలో భక్తులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  నీలాటిరేవు మరమ్మత్తులు చేపట్టాలని పంచాయితీరాజ్ శాఖని ఆదేశించారు.  తదుపరి వనం గుడి ప్రదేశాన్ని పరిశీలించారు.  జాతర సందర్భంగా సిరుమాను తిరిగే ప్రదేశాలను, తిరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.         ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ విధేఖర్, ఐటిడిఎ పి.ఓ. కూర్మనాధ్ వెంట ఆలయఈవో బిఎల్ నగేష్, తహశీల్దారు డి.వీరభద్రరావు, మండల పరిషత్ అభివృద్ది అధికారి సిహెచ్ సూర్యనారాయణ, ట్రాన్సుకో అసిస్టెంట్ ఇంజనీరు శివశంకర్ లతో పాటు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.