కోవిడ్ వ్యాక్సిన్ తో మరింత ఆరోగ్య రక్షణ..


Ens Balu
2
Sankhavaram
2021-01-16 20:54:17

కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తో ప్రపంచ మానవాళికి ఆత్మవిశ్వాసం, ఆరోగ్యంపై భద్రత పెరుగుతుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. పేర్కొన్నారు. శనివారం శంఖవరం మండంలోని పీహెచ్సీలో తహశీల్దార్, సుభ్రమణ్యం, ఎంపీడీఓ జె.రాంబాబు, పీహెచ్సీ వైద్యులు డా.సత్యన్నారాయణలతో కలిసి  కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని ఈ కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు చెందాల్సిన పనిలేదన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయడం అనేది చాలా పెద్ద ప్రక్రియ అని, ఇది దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. కరోనా వల్ల మంది మృత్యువాత పడ్డారని, కరానా లాంటి కష్ట సమయంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలు అందించారన్నారు. అందుకోసం మొదటిగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం జరుగుతోందని, రెండో విడతలో పోలీసు, రెవెన్యూ సిబ్బందికి, మూడవ విడతలో ప్రజలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ రావడం అనేది కరోనాపై మానవాళి విజయం అన్నారు. ప్రపంచంలోనే మానవాళికి వ్యాక్సిన్ అనేది ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి దోహదం చేస్తుందన్నారు. మొదటిసారి వ్యాక్సిన్ వేసుకున్న వారు 25 రోజుల తర్వాత రెండవ డోసు కూడా ప్రతి ఒక్కరు వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న 42 రోజుల వరకు ప్రతి ఒక్కరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదన్నారు. మండంలో సుమారు 100 మంది పేర్లు రిజిస్టర్ చేయగా 75 మందికి వేక్సిన్ అంచినట్టు డాక్టర్ సత్యన్నారాయణ తెలియజేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు