అర్హులైన ప్రతీ ఒక్క నిరుపేదకి సొంతిల్లు..


Ens Balu
3
Narsipatnam
2021-01-18 16:43:09

రాజకీయాలు, కులమతాలకతీతంగా అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇంటిస్థలాన్ని ఇవ్వడం, అంతేకాకుండా ఇంటినిర్మాణాలను సైతం కట్టించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు.  సోమవారం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, అర్బన్ హౌస్ సైట్స్ పంపిణీ కార్యక్రమం లో భాగంగా పెదబొడ్డేపల్లి జోగినాదునిపాెలెం, బలిఘట్టం లలో సుమారు 734మంది అర్హులకు ఇంటి స్థల పట్టాలను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజల కష్టాలను కళ్ళారా చూసి మానిఫెస్టో లో పొందుపర్చిన హామీ లను తూ చ తప్పకుండా పాటిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతీ నిరుపేద కుటుంబం సొంత ఇంటి కల సాకారం అయ్యే విధంగా ఇళ్ళ స్థలాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతీఒక్కరికీ పలు సంక్షేమ పథకాలను అందజేస్తూ ఆర్థిక చేయూత ఇస్తున్నారన్నారు.  ప్రజల క్షేమం కోసం అహర్నిశలూ పాటు పడుతున్న మన ముఖ్యమంత్రి దేశంలో నే మూడవ స్థానం లో నిలిచారని ఇందుకు మనమందరం గర్వపడాలన్నారు.  ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ పి కనకారావు, తహసిల్దార్  జయ ,రెవిన్యూ,మునిసిపల్  అధికారులు సిబ్బంది హాజరయ్యారు.
సిఫార్సు