ప్రతీ నిరుపేదకు సొంతిల్లే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
4
Anakapalle
2021-01-20 13:50:47

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ నిరుపేదకు సొంతిల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి లక్ష్యమని  ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అన్నారు. బుధవారం అనకాపల్లి మండలంలో 11 గ్రామాలకు చెందిన 2016 మంది లబ్ది దారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతీ ఒక్కరూ గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ఇంటికోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు ఆధ్వర్యంలో  ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి  దంతులూరు దిలీప్ కుమార్,  మండల నాయకులు జోగా నాగేశ్వర్రావు, పలకా సత్యనారాయణ, మల్లేష్, పల్ల శ్రీను, నంబారి రమణ, యాకోబు, ఆడారి సూరిబాబు, రాపేటి వెంకటేష్, పిడి గాంధీ, పడాల గణపతి, ఆడారి సూరిబాబు, రామ్ కుమార్, చదరం చిన్న, పెద్దాడ రామ్ శంకర్, కర్రీ అప్పారావు, కరణం నాగేశ్వరరావు, మిద్దె రామచందర్ రావు, మజ్జి వెంకట అప్పారావు , సకల సంతోష్, లబ్ధిదారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.