సొంతింటి కల నేరవేర్చేది సీఎం జగన్ మాత్రమే..


Ens Balu
2
Bheemili
2021-01-20 17:42:52

ఆంధ్రప్రదేశ్ లోని నిరుపేదల సొంతింటి కల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే తీర్చాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివారావు అన్నారు. బుధవారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మజ్జివలసలో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మజ్జివలస,లక్ష్మీపురం ,సింగన్న బంధ, మజ్జిపేట సంబంధించి 415 లక్షలతో నిర్మిస్తున్న 231 గృహాల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, త్వరలోనే ఈ ప్రాంతాలన్నీ వై యస్ ఆర్ జగనన్న కాలనీలుగా రూపాంతం చెందబోతున్నాయన్నారు. అనంతరం కాలనీ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. మజ్జివలస గ్రామంలో మూడు కోట్ల 86 లక్షల 90 వేలకు సంక్షేమ పథకాలు, రెండు కోట్ల 10 లక్షల పైగా రూపాయలతో అభివృద్ధి  పనులు చేపట్టామన్నారు.  లక్ష్మీ పురం, సింగనబంద, మజ్జి పేటలో సంక్షేమపథకాలకు దాదాపుగా 16 కోట్లకు పైగా చేపట్టామన్నారు.  అభివృద్ధి పనుల కోసం దాదాపుగా మూడు కోట్ల కేటాయించినట్టు వివరించారు. ఎవరూ భూములను అమ్ముకోవద్దన్న మంత్రి విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని దీంతో మరింత అభివృద్ధి చెందుతుందని సూచించారు. ఇల్లు కట్టించి ఆయా ప్రాంతాల్లో కావాల్సిన ఇల్లు, రోడ్లు, నీటి సదుపాయం, విద్యుత్ , ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిఫార్సు