సీఎం చొరవతో కొత్తగా గ్రామాల ఏర్పాటు..


Ens Balu
4
Vijayapuram
2021-01-20 17:53:07

నిరుపేదలకు సొంతింటి సమకూర్చి ఒక కొత్త గ్రామంగా ఏర్పాటు చేస్తున్నఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని నగిరి ఎమ్మెల్యే ఆర్కేరోజా అన్నారు. బుధవారం విజయపురం మండలం గొల్లకండిగ లో వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ళపట్టాలు పంపిణీ చేపట్టి  కొత్త ఇళ్ళ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో నిరుపేదలకు ఇళ్లు, ఇంటి పట్టాలు పంపిణీ చేయలేదన్నారు. ప్రజాప్రభుత్వానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. అనంతరం బూచివానెత్తం 29( గొల్లకండిగ-21, ఆమగుంట-08,  సామిరెడ్డి కండిగ-11, కొత్తూరు వెంకటాపురం-31, ఎం.అగరం-03, పోతులరాజు కండిగ-02 మొత్తం 76 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, రామకృష్ణంరాజు, రాజగోపాల్, గుణశేఖర్ రెడ్డి, జిల్లు, శివరాజు, బాలాజి, శేఖర్, ప్రతాప్, చంద్రయ్య, కుప్పయ్య, శేఖర్ రాజు, రత్నం, కిషోర్ హౌసింగ్ డి.ఇ శంకరప్ప, ఎమ్మార్వో కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు