ప్రజలకు సకాలంలో సేవలందించాలి..
Ens Balu
1
Gantyada
2021-01-20 20:27:13
గ‌్రామ సచివాలయాలకు వివిధ సేవల నిమిత్తం వచ్చే దరఖాస్తులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు ఆదేశించారు. గంట్యాడ మండలం లఖిదాం, వసంత గ్రామాల్లో గ్రామ సచివాలయాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ నిర్వహణ, రికార్డుల నిర్వహణను, సంక్షేమ పథకాల పోస్టర్లు, ఆ పథకాలకు అర్హత, దరఖాస్తు చేసుకొనేందుకు అర్హతల వివరాలతో కూడిన అంశాలను ప్రదర్శించినదీ లేనిదీ పరిశీలించారు. సచివాలయానికి వచ్చిన వినతులను ఎంత వ్యవధిలో పరిష్కరించిందీ తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది ఏయే రకాల విధులు నిర్వహిస్తున్నదీ తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలను పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, గ్రామీణ ప్రజలకు వీటిద్వారా అత్యుత్తమ సేవలు సకాలంలో అందించాలని సూచించారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుండి చేపడుతున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గంట్యాడ ఎం.పి.డి.ఓ. నిర్మలాదేవి కూడా పర్యటనలో పాల్గొన్నారు.