ఎఎల్‌ ‌పురంలో మరోనా కరోనా పాజిటివ్ కేసు..


Ens Balu
11
A.l.puram bus stop
2020-08-15 19:00:01

గొలుగొండ మండలం ఎఎల్‌పురంలో మరో కరోనా కేసు నమెదైయ్యింది. మధ్యప్రదేశ్‌ ‌నుండి ఎఎల్‌పురం బిసి కాలనీ వచ్చిన వ్వక్తికి  కరోనా లక్షణాలు ఉండటంతో తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని  డాక్టర్‌ ‌ప్రణతి తెలిపారు. ఇప్పటికే గ్రామంలో 2 కేసులు నమెదుకాగ దీంతో 3 కేసులుకు చేరాయి. పాజిటివ్ వ్యక్తిని తక్షణమే నర్సీపట్నం ఏరియీ అసుపత్రికి అంబులెన్సులో తరలించారు. ఈయన ప్రైమరరీ, సెకండరీ కాంటాక్ట్ లకు పరీక్షలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పనులకు తప్పా ఎవరూ బయటకు రాకూడదన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు దరించి తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలన్నారు. 
సిఫార్సు