టూరిజం స్పాట్ గా విశాఖ మ్యూజియం..
Ens Balu
4
Visakhapatnam
2021-01-23 19:38:13
విశాఖ మ్యూజియం టూరిజం స్పాట్ గా సందర్శకులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం వలన మూతపడిన విశాఖ మ్యూజియంను జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శనివారం తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియంను సందర్శించిన పర్యాటకులతో ముచ్చటించారు. కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలన కానందున, పర్యాటకులు తగు జాగ్రత్తలు పాటించాలని, మాస్కులను ధరించి, మ్యూజియంను సందర్శించాలని కోరారు. మ్యూజియంను తిరిగి ప్రారంభమైన రోజున సందర్శించిన పిల్లలకు స్వాగతిస్తూ, తీపి మిఠాయిలను పంచారు. మ్యూజియం మరింత అభివృద్ధి చేయడానికి నూతన ప్రతిపాదనలతో ముందుకు రావాలని మ్యూజియం క్యూరేటర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం క్యూరేటర్ బి. సన్యాసి నాయుడు, మ్యూజియం సిబ్బంది, సందర్శకులు పాల్గొన్నారు.