శారదా పీఠాధిపతి సేవలో రాష్ట్ర మంత్రి..


Ens Balu
3
Pendurthi
2021-01-23 20:54:17

విశాఖలోని శ్రీ శారద పీరాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు త్తంశెట్టి శ్రీనివాసరావు  కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈమేరకు పెందుర్తిలోని శారదా పీఠానికి వెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పీఠంలో కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి పూజలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పీఠాధిపతి స్వామి . ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి జ్ఞానేశ్వరి, కుమారుడు శివ నందీశ్, కుమారై లక్ష్మీ ప్రియాంక, అల్లుడు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పీఠంలోని సిబ్బంది మంత్రి పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.