నందిగామలో పోలీసుల ప్లాగ్ సెర్చ్..


Ens Balu
4
Nandigama
2021-01-27 21:45:38

ఎటువంటి ఘర్షణలకు పాల్పడకుండా, ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు జరగాలని నందిగామ డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. క్రిష్ణాజిల్లా కంచికచర్ల మండలం లోని బుధవారం రాత్రి నందిగామ, మొగులూరు, చెవిటికల్లు,  గని అత్కూరు, పరిటాల, గొట్టుముక్కల గ్రామాల్లో ఫ్లాగ్ సేర్చ్ (పోలీస్ కవాతు)  నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ వచ్చే నెలలో గ్రామపంచాయతీ  ఎన్నికలు జరుగుతున్నందున, గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎటువంటి ఘర్షణలకు  పాల్పడవద్దని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో వెనక నుండి ప్రజలను ప్రోత్సహిస్తూ ఘర్షణలకు పాల్పడే వ్యక్తులు ఉంటారని హెచ్చరించారు. అల్లర్లు చేయాలనుకునేవారిపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రత్యేకమైన దృష్టి పెట్టారన్న ఆయన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రశాంతమైన వాతావరణంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగాలని, పోలీసు వారికి సహకరించాలని, సమస్యాత్మక మైన గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండలంలోని పరిటాల గ్రామానికి  ప్రత్యేకంగా ఒక ఎస్సైని  కేటాయించామని వివరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్సై రంగనాథ్, ఎస్ ఐ 2  లక్ష్మి, ఎస్ఐ ఏసుబాబు, చందర్లపాడు ఎస్ ఐ ఏసోబు, వీరులపాడు ఎస్ ఐ మణికుమార్, మొబైల్ పార్టీ ఎస్ఐ కోటేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.