విద్యార్ధులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ..


Ens Balu
1
పాడేరు
2021-02-01 19:38:53

విశాఖజిల్లా పాడేరు మండలం రాములుపుట్టు జిపిఎస్ ట్రైబల్ పాఠశాలలో విద్యార్ధినీ విద్యార్ధులకు సోమవారం ప్రభుత్వం మంజూరు చేసిన బ్యాగులు, పుస్తకాలను పాఠశాల ఉపాధ్యాయిని రాధ అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయిని రాధ మాట్లాడుతూ పాఠశాల రీఓపెన్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరు పిల్లలకు ఎడ్యుకేషన్ కిట్ కింద ఒక బ్యాగు, బట్టలు, పుస్తకాలు, నోట్సులు, బూట్లు అందరికీ ఇచ్చామన్నారు. అదేవిధంగా  తనవంతుగా సాయంగా పిల్లలందరికీ పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు ఇచ్చినట్టు టీచర్ చెప్పారు. ఇంకా బడికి రానివారికోసం గ్రామంలో చాటింపు వేయించామని, ప్రతీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కబుర్లుకూడా పంపించామన్నారు. మిగిలిన విద్యార్ధులకు కూడా ప్రభుత్వం అందించిన కిట్ లను అందజేయనున్నట్టు చెప్పారు. మధ్యాహాన్న భోజనం కూడా విద్యార్ధులకు టీచర్ రాధ దగ్గరుండి వడ్డించి, వారితో పాటు కలిసి భోజనం చేశారు. అనంతరం కొత్తగా నాడు-నేడులో పాఠశాలలు ఏ విధంగా అభివ్రుద్ధి చేశారో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లందరికీ పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.