మీసేవ ద్వారా మంచి సేవలు అందించాలి..సోమిరెడ్డిరాజు
Ens Balu
1
Yalamanchilli
2020-08-16 12:01:57
మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించాలని సామాజిక కార్యకర్త సోమిరెడ్డి రాజు ఆకాంక్షించారు. యస్.రాయవరం గ్రామంలో పంచాయితీ పక్కన ఉన్న మీసేవ(నెట్ సెంటర్) ని గురజాడ సెంటర్, రాము టిఫిన్ షాప్ ఎదురుగా మార్చారు. నూతన నెట్ సెంటర్ ని రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని కార్యకలాపాలు నెట్ లేనిదే జరగడం లేదన్నారు. అలాంటి సమయంలో ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా వారికి సహాయం చేసినట్టు వుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కందుల నాగేశ్వరావు, అధికంశెట్టి జగన్నాధరావు, బత్తుల వాసు, దండు గణపతిరాజు, దుబాసి రమేష్, గాలి దివానం , మురుకుర్తి గణేష్, సిలపరశెట్టి క్రిష్ణ, తాడేల సంతోష్, తదితరులు పాల్టొన్నారు.