అట్టహాసంగా పందిరి సత్యన్నారాయణ నామినేషన్..
Ens Balu
3
Krishnadevipeta
2021-02-04 12:45:28
విశాఖజిల్లా గొలుగొండ మండలంలోని క్రిష్ణదేవిపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా పందిరి సత్యన్నారాయణ(సత్యన్నాయుడు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్) గురువారం అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. వార్డు సభ్యులు, యువత, వైఎస్సార్సీపీ కార్యకర్తలు,తన దారులతో కలిసి పెద్ద ర్యాలీగా వెళ్లి ఏఎల్ పురంలోని పంచాయతీ కార్యాలయంలో తన నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నడూ లేనివిధంగా సరికొత్తగా సర్పంచ్ అభ్యర్ధి నామినేషన్ ప్రక్రియకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నాయుడు తెరతీశారు. క్రిష్ణదేవిపేట(పాతూరు) నుంచి ఆటోలు, బైకులు, కార్లతో వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై మన్యం పితూరి తిరుగుబాటు జరిపిన పోరుగడ్డ క్రిష్ణదేవిపేట పంచాయతీకి సర్పంచ్ అభ్యర్ధిగా నామినేషన్ వేసినట్టు చెప్పారు. తన గ్రామం అభివ్రుద్ధి, ఈ ప్రాంతానికి తన జీవితం అంకితం చేయాలనే లక్ష్యంతో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఏమీకాకుండా వదిలి వచ్చానని స్పష్టం చేశారు. గ్రామాభివ్రుద్ధికే తన తొలిప్రాధాన్యత ఇస్తానని, యువత రాజకీయాల్లోకి రావాలనే దివంగత మహానేత వైఎస్సార్ మాలను స్పూర్తిగా తీసుకొని కదన రంగంలోకి అడుగు పెట్టానని అన్నారు. తన రాజకీయ అరంగట్రానికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ లు ప్రేరణ అని కూడా చెప్పారు. అంతకుముందు గ్రామ దేవతలకు ప్రత్యేకపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మద్దతు దారులు మాజీ సర్పంచ్ పందిరి అప్పారావు, పందిరిరామారావు, ఆర్ఎంపీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.