సత్యన్నాయుడికి అడుగడుగునా నీరాజనం..


Ens Balu
3
Krishnadevipeta
2021-02-04 19:50:07

లక్షల రూపాయల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదులుకొని తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవచేయడానికి సర్పంచ్ అభ్యర్ధిగా క్రిష్ణదేవిపేట పంచాయతీ బరిలో నిలిచిన పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్)కి గ్రామంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. గ్రామంలోని ఏవీధిలోకి వెళ్లినా హారతులు పడుతూ ఘనంగా స్వాగతం చెబుతున్నారు. గురువారం నామినేషన్ల సందర్భంగా పాతూరు గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో అత్యధిక సంఖ్యలో అభిమానులు, వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు, మహిళలు, మద్దతు దారులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగారు. ఈ సందర్భంగా మహిళలు హారతులు ఇచ్చి, పూలవర్షం కురిపించారు. మాకోసం, మన గ్రామం కోసం వచ్చిన నీవెంటే తామంతా జతకట్టి నడుస్తామంటూ జేజేలు పలికారు. గ్రామంలోని అన్నివీధులు ర్యాలీగా తిరిగి అనంతరం భారీ ఆటో కాన్వాయ్, బైకులతో ర్యాలీగా వెళ్లి ఏజెన్సీ లక్ష్మీపురంలో వార్డు సభ్యులతోపాటు నామినేషన్ వేశారు.  ఈ సందర్భంగా సత్యన్నారాయణ(సత్యంనాయుడు) మీడియాతో మాట్లాడుతూ, తనను కనీపెంచిన తల్లిదండ్రులు, ప్రేమాభిమానాలు చూపించే గ్రామస్తుల రుణం తీర్చుకోవడానికే తాను ఈసారి సర్పంచ్ అభ్యర్ధిగా బరిలోకి దిగానన్నారు. గ్రామాభివ్రుద్ధే లక్ష్యంగా అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలనకు ఆకర్షితుడనై తన సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలి సొంత గ్రామానికి వచ్చినట్టు చెప్పారు. తనపై పాతూరు గ్రామస్తులు చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎన్నడూ మరిచిపోలేనని వారందరికీ తనవంతు సహకారం అందిస్తానని, జీవితాంతం సేవలు చేసుకుంటానని చెప్పారు. ఏ నమ్మకంతో అయితే తనను సర్పంచ్ అభ్యర్ధిగా బలపరిచారో ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా గ్రామానికి, ప్రజలకు సేవచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.