కిముడు పల్లి గేదెగెడ్డ ఉద్రుతితో దిన దిన గండమే


Ens Balu
3
pedabayalu
2020-08-16 13:00:48

విశాఖ ఏజెన్సీలో గెడ్డ పాయలకు వంతెనలు లేకపోవడంతో భారీ వర్షాల సమయంలో అనే గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. పాడేరు ఐటిడిఏ పరిధిలోని పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామ పంచాయతీ  గేదెగెడ్డ వద్ద ఇలాంటి పరిస్థితే నెలకొంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో గేదెగెడ్డ నీరు పూర్తిగా రోడ్డుపైకి వచ్చేస్తుంది. కారణంగా రాకపోకలు చేసేవారంతా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరద ఉద్రుతికి ఎక్కడ కొట్టుకుపోతామనే భయంతో గెడ్డకు ఇవతల ఒడ్డునే ఉండిపోతున్నారు.  ఈ ప్రాంతంలో వంతెన దగ్గర వర్షపు నీరు అధికంగా వస్తే సుమారు 20 గ్రామాలకు పైనే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయ్. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని గిరిజనులు ముక్త కంఠంతో కోరుతున్నారు.