క్రిష్ణదేవిపేట పంచాయతీ బరిలో ఆ నలుగురు..
Ens Balu
3
Krishnadevipeta
2021-02-05 13:33:12
విశాఖజిల్లా గొలుగొండ మండంలోని క్రిష్ణదేవిపేట పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ప్రస్తుతం జిల్లాలోనే హాట్ టాపిక్ గా నిలుస్తోంది. పాతూరుగా పిలవబడే క్రిష్ణదేవిపేట గ్రామంలోని 1520 ఓటర్లు ఉన్నఈ పంచాయతీలో సర్పంచ్ సీటు కోసం ఏకంగా నలుగురు అభ్యర్ధులు బరిలో పోటీకి నిలబటం చర్చనీయాంశం అవుతుంది. అందులో అధికార పార్టీ నుంచే ముగ్గు అభ్యర్ధులు నిలుచోగా.. ఒకరు పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నిలబడుతున్నానని అందరికంటే ముందుగానే మీడియా ద్వారా ప్రకటించుకున్నారు. ఇక టీడీపీ నుంచి ఒక అభ్యర్ధి బరిలో నిలబడ్డారు. ఈ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా నలుగురు వ్యక్తులు సర్పంచ్ గా పోటీకి బాహా బాహీ అనడం, ఎవరి మద్దతుదారులతో వారు నామినేషన్లు వేయడం కూడా చకా చకా జరిగిపోయింది. నలుగురు వ్యక్తులు మొత్తం 40 మంది వార్డు సభ్యులను రంగంలోకి దించారు. ఎవరి స్థాయిలో వారి వారి బలాన్ని నిరూపించుకోవడానికి అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై మన్యం పితూరి ఉద్యమం నడిపిన పోరాటాల పురిటిగడ్డ క్రిష్ణదేవిపేటను వేదికగా చేసుకున్నారు. కుల, మత, సామాజిక, రాజకీయ పైరవీలకు తెరతీసి ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోవడానికి సిద్దమవుతున్నారు. దీనితో క్రిష్ణదేవిపేట పంచాయతీ సర్పంచ్ ఎన్నిక విషయంలో జిల్లాలోనే హాట్ హాట్ చర్చలకు దారితీసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ గ్రామంలో అభివ్రుద్ధికి ఏ మాత్రం నోచుకోదు కనీసం అల్లూరి సీతారామరాజు పాద దూళితో పునీతమైన ప్రదేశంగా కూడా నేతలు ఈ గ్రామాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు..దీనితో ఈ ప్రాంతాన్ని ఎవరు అభివ్రుద్ధి చేస్తారో వారికే తమ మద్దతు ఇస్తామని యువత, మహిళలు, ఇతరులంతా ఏకమై బరిలో నిలబడిన అభ్యర్ధులకు మొహం మీదే చెబుతున్నారు. నలుగురు అభ్యర్ధులకూ సామాజికంగా మంచి ఓటు బ్యాంక్ వుంది. దీనితో బరిలో నిలబడ్డవారిలో ఎవరికి 500 ఓట్లు దాటితే వారు ఈ పంచాయతీ పోరులో సర్పంచ్ సీటులో ఆశీనులవడానికి ఆస్కారం వుంటుంది. గ్రామంలో ఉన్న 1520 ఓట్లలో సుమారు 150 ఓట్ల వరకూ గ్రామం నుంచి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారు. మిగిలిన ఓట్లన్నీ పూర్తిస్థాయిలో పోలైతే అనుకున్న మేజిక్ ఫిగర్ తో సర్పంచ్ సీటు కైవసం చేసుకోవడానికి ఆస్కారం వుంటుంది. ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వెళ్లిన వారంతా తిరిగి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక పోతే గ్రామంలో అధికంగా వున్న మహిళలు, పెద్దవారు ఓట్లను రాబట్టుకోవడంలో అభ్యర్ధులు పోటీ పడాల్సి వుంటుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అభ్యర్ధులు బరిలో నిలవడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పంచాయతీ ఎన్నికలకు ఈ గ్రామం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందులోనూ పార్టీగుర్తుతో కాకుండా ఇతర గుర్తులతో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఆశావాహులను పెద్దలు, పార్టీల నేతలు బుజ్జగించాలని చూసినా ఎవరికి వారు, నేరుగా రంగంలోకి దిగిపోయారు. ఒక చిన్న పంచాయతీలో ఏకంగా నలుగురు అభ్యర్ధులు ఒక సర్పంచ్ సీటు కోసం ఎన్నికల్లో తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి దిగడం విశ్లేషకులకు సైతం పూర్తి పనిచెప్పిటనట్టు అయ్యింది. అయితే అభ్యర్ధులకు గుర్తులు కేటాయింపు జరిగిన తరువాత మరోసారి సీన్ మొత్తం రివర్స్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈలోగా పంచాయతీపోరుకి సిద్ధ పడిన వారంతా ఎవరిస్థాయిలో వారు ఓటర్లును బుజ్జగించో, బతిమాలో, ప్రలోభాలకు గురిచేసో లేదంటే ఏకంగా బెదిరించో ఓట్లు రాబట్టు కోవాల్సి వుంటుంది. అభ్యర్ధులకు గుర్తులు కేటాయించిన తరువాత, ఎలక్షన్ రోజు ముందు వరకూ పైరవీలు కొనసాగినా ఎలక్షన్ రోజు మాత్రం ఓటర్లు ఎవరికి గట్టిగా గుద్దారనే విషయం తేలుతుంది. క్రిష్ణదేవిపేట పంచాయతీల పోరులో ఆ నలగురిలో ఎవరు సర్పంచ్ సీటుపై ఆశీనులవుతారనేది వేచి చూడాల్సి వుంది..!