13న నర్సీపట్నం డివిజన్లో ఎన్నికలు..


Ens Balu
3
Narsipatnam
2021-02-05 20:10:08

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా నర్సీపట్నం డివిజన్ పరిధిలోని  రావికమతం  మండలం కొత్తకోట, దొండపూడి, మేడివాడ ,రావికమతం, చిన పాచిల గ్రామ పంచాయితీలు, కోటవురట్ల మండలం జల్లూరు , కోటవురట్ల , కైలాసపట్నం గ్రామ పంచాయతీలలో నామినేషన్, పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ను శుక్రవారం  నర్సీపట్నం డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధారిటీ, మరియు సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఆయా కేంద్రాలలో జరుగుతున్న  నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి తగిన సూచనలను జారీచేశారు.  ఆనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నేడు శుక్రవారం  (5వ తేదీ)నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ( స్క్రూటినీ) ముగిసిందన్నారు.  6 వ తేదీ  నామినేషన్ పత్రాలఅభ్యంతరాల/తిరస్కరణ  పరిశీలన(అబ్జెక్షన్స్), 7 వ తేదీ తుది నిర్ణయం (డిస్పోసల్ అప్పీల్స్), 8 వ తేదీ నామినేషన్ల ఉప సంహరణ (విత్ డ్రాయల్స్)  సాయంత్రం 3గం. లతో ముగుస్తాయన్నారు.వెంటనే అదే రోజు ఎన్నికల బరి లో నిలబడే అభ్యర్థుల తుది జాబితా మరియూ గుర్తులను కేటాయించడం జరుగుతుందన్నారు. నామినేషన్ పత్రాల అభ్యంతరాలకు సంబంధించి అభ్యర్థులు సబ్ కలెక్టరు కు అప్పీలు చేసుకోవచ్చన్నారు. 13 వ తేదీ  శనివారం నర్సీపట్నం డివిజన్ పది మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. పోలింగ్ ఉదయం 6.30 నిమిషాల నుండి సాయంత్రం 3.30 ని.ల వరకూ జరుగుతుందన్నారు.  అదేరోజు సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అదే విధంగా నామినేషన్ వేసిన అభ్యర్దులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కి  సంబంధించి ఎటువంటి  ఫిర్యాదు చేయాలన్నా  సబ్ కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్లు...7731803255, 8465013255   నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకోవాలన్నారు.  పర్యటనలో  సంబంధిత మండల ఎంపీడీవో లు, తాసిల్దార్ లు, రిటర్నింగ్ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.