ఎన్నికల నియమావళి పాటించాల్సిందే..
Ens Balu
3
Seethanagaram
2021-02-06 18:51:54
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరిస్తూ విధులు నిర్వహించాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి, పార్వతీపురం నియోజక వర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్లో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కు సంబంధించి పార్వతీపురం నియోజకవర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి శనివారం సీతానగరం మండలం ఎం.పి.డి.ఓ కార్యాలయం సందర్శించారు. ముందుగా ఎన్నికలకు సంబంధించి చేపడుతున్న పనులపై ఆరా తీశారు. అలాగే ఈ నెల 13వ తేదీన జరుగనున్న ఎన్నికలకు సంబందించి సీతానగరం మండలంలో 312 పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయవలసిన బ్యాలెట్ బాక్స్ లు, ఇతర ఎన్నికల సామాగ్రి పరిశీలించారు. ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఆన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించి ప్రశాంతంగా ఎన్నికలు జరపాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీతానగరం తహశీల్దార్, ఎం.పి.డి.ఓ రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.