ప్రశాంతంగా పంచాయతీ పోలింగ్ జరగాలి..
Ens Balu
2
Balijipeta
2021-02-06 18:53:13
పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ముందుగా ఆన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి, పార్వతీపురం నియోజక వర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్. కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ నెల 13న గ్రామ పంచాయితీ పోలింగ్ కు సంబందించి శనివారం పార్వతీపురం నియోజక వర్గం, బలిజిపేట మండలం, గంగాడ, బర్లీ గ్రామ పంచాయతీలలో గంగాడ, బర్లీ గ్రామాల్లో ఎం.పి.పి స్కూల్ లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి, పార్వతీపురం నియోజక వర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి కూర్మనాథ్ పరిశీలించారు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఆన్ని ఏర్పాట్లు చేయాలని ఎం.పి.డి.ఓ కి సూచించారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగు నీరు, విద్యుత్, స్టేషనరీ, విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లకు సౌకర్యాలు, ఫర్నిచర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ననుసరిస్తు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో బలిజిపేట ఎం.పి.డి.ఓ , తహశీల్దార్, సెక్రెటరీ, విఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.