ఎస్.రాయవరంలో టిడిపి విస్త్రుత ప్రచారం..


Ens Balu
2
s.rayavaram
2021-02-06 20:11:25

విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా టిడిపి నాయకులు విస్త్రుత ప్రరాచం చేపట్టారు. శనివారం ఇంటింటికి వెళ్లీ ఉదయం 8, 12 వార్డుల్లోని వారిని కలిశారు. అనంతరం సాయంత్రం 14, 9 వార్డుల్లోని వారిని కలిసి ఓట్లు అభ్యర్ధించారు. టిడిపి అధికారంలో వున్నప్పుడు చేసిన అభివ్రుద్ధిని ప్రజలు మరిచిపోకూడదని   తెలుగుదేశం పార్టీ నాయకులు కందుల వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి రాజు అభ్యర్ధి తరపున ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్లు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రజలన ఓట్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో దుబాసి రమేష్, మురుకుర్తి గణేష్, కర్రి శ్రీనివాసరావు, తాడేల సంతోష్, గాలి దివాణం,తాడేల సూరన్న, భీమరశెట్టి శ్రీనివాసరావు, మద్దాల లక్ష్మణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిఫార్సు