ప్రచారంలో దూసుకుపోతున్న సత్యన్నాయుడు..
Ens Balu
3
Krishnadevipeta
2021-02-07 14:01:03
గొలుగొండ మండలంలోని ప్రతిష్టాత్మక క్రిష్ణదేవీపేట(పాతూరు) పంచాయతీకి సర్పంచ్ బరిలో వున్న పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నాయుడు) ప్రచారంలో దూసుకుపోతున్నాడు. పాతూరు గ్రామంలో నిర్వహిస్తున్న కేన్వాసింగ్ కి గ్రామస్తుల నుంచి విశేషంగా స్పందన లభిస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పాతూరు గ్రామంలో ప్రతీ ఓటరును సత్యన్నాయుడు పలుకరిస్తూ ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. తనని సర్పంచ్ గా గెలిపిస్తే ఎవరూ ఏ పనికోసం, సంక్షేమ పథకాల కోసం ఎక్కడికీ వెళ్లకుండా తానే అన్నీ అయి చూసుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు. ప్రజాసేవకోసం పంచాయతీకార్యాలయంతోపాటు తన ఇంటిదగ్గర మరో కార్యాలయం ఏర్పాటు చేసి మరీ ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తానని బరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి సచివాలయ స్పందన, మండల కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన కార్యక్రమాల ద్వారా అర్జీలు పెట్టి అర్హులైన వారందరికీ పథకాలు, రేషన్ కార్డులు వచ్చేలా చేస్తున్నానని ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ గ్రామపరిధిలోనే అందించే ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు. పాతూరు గ్రామాన్ని జిల్లాలోనే ఒక మంచి అభివ్రుద్ధి చెందిన గ్రామంగా తీర్చదిద్దడానికి ప్రతీ ఒక్క ఓటరు దగ్గరకి వెళ్లి గ్రామాభివ్రుద్ధికి సహకరించాలని కోరుతున్నారు. ఇప్పటికే తన ఇంటి వద్ద ప్రత్యేక కార్యాలయంల ఏర్పాటు చేశానని దాని ద్వారా సేవలు పొందవచ్చునని ఓటర్లకు చెబుతున్నారు. ఎవరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని బాధపడవద్దని.. అందరికీ సమసన్యాయం చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొదించి దానిని అమలు చేయడానికే తాను సర్పంచ్ అభ్యర్ధిగా మీ ముందుకి వచ్చానని ప్రజలను చైతన్య పరుస్తున్నారు. అన్నివర్గాల వారికి సమ న్యాయం చేసేవిధంగా వార్డు మెంబర్లుగా కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి అభ్యర్ధులను 10 వార్డుల్లో నిలబెట్టామని వారే వార్డులోని సమస్యలు తన ద్రుష్టికి తీసుకు వస్తారని, ఆ వెంటనే తాను పరిష్కరించి మీ అందరికీ సేవచేసుకుంటానని చెబుతున్నారు. ఎన్నికల్లో అంతా మాటలు చెబుతారని కానీ తాను గ్రామం రూపు రేఖలు మార్చి చూపించడానికే లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదులుకొని మీకు సేవలు చేయడానికే వచ్చానని తెలియజేస్తున్నారు. గ్రామంలో రాజకీయం చేయడానికి తాను ఈసారి సర్పంచ్ గా నిలబడటం లేదని, కేవలం గ్రామాభివ్రుద్ధే లక్ష్యం చేసుకొని మీ అందరి సహకారం ఆశీర్వాదం కోరుతున్నానని ఓటర్లను అభ్యర్ధిస్తూ ముందుకి సాగుతున్నారు. ఈ ప్రచారం కార్యక్రమంలో ఆర్ఎంపీ వైద్యుడు పందిరి వెంకటరమణ(బుజ్జి), అన్ని వార్డుల నుంచి అధిక సంఖ్యలో మహిళలు, యువత, పెద్దలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.