విశాఖలో ఘనంగా శ్రీరామ శోభాయాత్ర..
Ens Balu
2
Visakhapatnam
2021-02-07 14:36:19
శ్రీరామ శోభాయాత్ర విశాఖలోని తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర - అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో భాగంగా బీజేవైఎమ్ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్రను ప్రారంభించారు..ఈ సందర్బంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాటూరి రవీంద్ర మాట్లాడుతూ, శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ బాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. శ్రీరామునికి ఆలయం నిర్మించుకునే భాగ్యం మనకి దక్కినందుకు గర్వపడాలన్నారు. వేలాదిమంది భక్తుల ఆధ్వర్యంలో కొనసాగిన శోభాయాత్ర కొత్త వెంకోజిపాలెం పెట్రోల్ బంక్,ఎంవీపీ క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు,టీటీడీ సర్కిల్ నుంచి ఇసుకతోట సిగ్నల్ మీదుగా జాతీయరహదారి చేరుకొని అక్కడి శ్రీకృష్ణ ఆలయం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం సభ్యులు, శ్రీరామ భక్తులు, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.