పాతూరుకి పంచాయతీ పండగొచ్చింది..


Ens Balu
5
Krishnadevipeta
2021-02-07 17:26:37

అవును మీరు చదువుతున్నది నిజమే పాతూరు(క్రిష్ణదేవిపేట)కి పంచాయతీ పండుగొచ్చింది..అభివ్రుద్ధికి ఆమడ దూరంలో మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై పోరు సలిపిన పోరాటాల పురిటిగడ్డ క్రిష్ణదేవీపేటకు నాటి వైభవం మళ్లీ వచ్చినట్టే కనిపిస్తుంది. 2021 పంచాయతీ ఎన్నికల బరిలో పోటీలో వున్న పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నారాయుడు) తన అనుచరులు, అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్య మహిళలతో జరుపుతున్న ఎలక్షన్ కేన్వాసింగ్ అచ్చుగుద్దినట్టు పాతూరుకి మరోసారి సంక్రాంతి పండుగ తీసుకొచ్చినట్టే కనిపిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మందికి పైగా జనంతో గడప గడపకూ జరుపుతున్న ఎన్నికల ప్రచారం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అన్నయ్య బాగున్నావా, తమ్ముడూ ఎలా ఉన్నావ్, అక్కా నేను మీ అందరికోసం వచ్చాను, అత్తా నన్ను మీ చల్లని చేతులతో దీవించాలి, మామ్మ నీ కష్టాలు తీరిపోయినట్టే నీ మనవడు వచ్చాడు, మీ ఏ పనికోసం ఎవరినీ అర్ధించాల్సిన పనిలేదు, అన్ని పనులూ నేనే దగ్గరుండి చూసుకుంటాను, మీకు జీవితాంతం సేవచేసుకోవడానికే వచ్చాను అంటూ అందరినీ పేరుపేరునా కుటుంబ సభ్యుడిలా పలుకరిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్న తీరు గ్రామంలో ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. పంచాయతీ పోలీంగ్ కి దగ్గర పడుతుండటంతో అన్ని వర్గాల వారిని ముఖ్యంగా మహిళలను కలుపుకుంటూ ముందుకు వెళుతున్న తీరుకి మంచి ఆదరణ లభిస్తుంది. ఎన్నడూ లేని విధంగా క్రిష్ణదేవీపేట పంచాయతీ ఎన్నికల బరిలో నలుగురు వ్యక్తులు సర్పంచ్ అభ్యర్ధులుగా నిలబడినా, అందరినోటా కాబోయే సర్పంచ్ పందిరి సత్యన్నాయుడే అంటూ అనిపించేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పాతూరు గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా చర్చనీయాంశం అవుతోంది. ఎవరికి వారు ప్రచారం చేపడుతున్నా, సత్యన్నాయుడు చేస్తున్న ప్రచారంలో కొత్తదనం కనిపిస్తుండటంతో గ్రామస్తులందరూ ఈయనికి బ్రహ్మరధం పడుతున్నారు.  ప్రధానంగా దుంపలపూడి సహదేవుడు అండ్ కో చేస్తున్న సహకారం హైలేట్ గా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మాజీ ఉప సంచాలకులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, ఆర్ఎంపీ బుజ్జీ, పదివార్డులకు చెందిన వార్డు మెంబర్లు, అధిక సంఖ్యలో మహిళలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.