పాతూరులో సత్యన్నాయుడు వినూత్న ప్రచారం..
Ens Balu
2
Krishnadevipeta
2021-02-09 08:58:06
విశాఖజిల్లా, గొలుగొండ మండలంలోని క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీ సర్పంచ్ ఎన్నిక బరిలో వున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యన్నాయుడు(మాజీ సర్పంచ్ అప్పారావు తనయుడు పందిరి సత్యన్నారాయణ) తన పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని వినూత్న రీతిలో చేస్తున్నారు. ఎవరైనా ఓట్లు అభ్యర్ధించడానికి వెళ్లినపుడు తనుకు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పడం రివాజు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న గ్రామసచివాలయాల సర్వీసులపై ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పిస్తున్నారు. దీనితో జిల్లాలోనే సరికొత్త పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరతీసిన యువ సర్పంచ్ అభ్యర్ధిగా సత్యన్నాయుడికి గుర్తింపు ఏర్పడింది. ప్రభుత్వం ఏఏ సంక్షేమ పథకాలు ఎవరెవరికి మంజూరు చేస్తుంది? దానికోసం గ్రామసచివాలయంలో ఏ ప్రభుత్వ శాఖ సిబ్బంది ఎవరికి ఏవిధంగా సహాయం చేస్తారు? అర్హులైన వారికి సంక్షేమ పథకాలు రాకపోతే ఎవరిని సంప్రదించాలి? ఏవిధంగా దరఖాస్తుచేసుకోవాలి? చాలా మందిలో పథకం పోతుందనే భయాన్ని ఎలా పోగొట్టాలో? ఆవిధంగా ప్రజలను చైతన్య పరుస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు..! అంతేకాకుండా తన ప్రచారంలో పూర్తిగా ఏ ఇంటికి వెళ్లినా ముందు వారి సమస్యలు, వారి వీధిలో వున్న ప్రధాన ఇబ్బందులను అడిగిన తరువాత, వారికి భరోసా ఇస్తూ తనని గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తానంటూ వారికి నమ్మకాన్ని కల్పిస్తున్నారు. అక్కడికక్కడే ఒక వ్యక్తి ద్వారా వార్డులోని ప్రధాన సమస్యలు ఒక పుస్తకంపై రాసుకుంటూ తన ప్రచారం, ప్రధాన సమస్యలను గుర్తిస్తూ ముందుకి సాగుతున్నారు. గ్రామ సచివాలయాలు, గ్రామవాలంటీర్లు వచ్చినా కూడా చాలా మందికి సంక్షేమ పథకాలు అందలేదనే విషయాన్ని ప్రజలు ప్రచారంలో భాగంగా సత్యన్నాయుడు ద్రుష్టికి తీసుకు రావడంతో ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించుకొని.. సంక్షేమ పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఎవరిని సంప్రదించాలో కూడా చెబుతున్నారు. మీకు తెలియకపోతే మీ తరపున తాను ప్రభుత్వకార్యాలయాలకు తిరిగి సమస్య పరిష్కారానికి క్రుషిచేస్తానంటూ ప్రజలకు ఒక పెద్ద నమ్మకాన్ని కలిగిస్తున్నారు. సత్యన్నాయుడు సర్పంచ్ ఎన్నికల ప్రచారం పుణ్యమాని చాలా మందికి సచివాలయంలో ప్రభుత్వం అందించే సేవలు విషయం తెలుసుకోవడానికి వీలుపడింది. సచివాలయంలో 14 ప్రభుత్వశాఖల ద్వారా ఏఏ సేవలు పొందాలో కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు సత్యన్నాయుడు. ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ఎవరో రాస్తే రావడం కాదు దరఖాస్తు చేస్తే ప్రతీ అర్హుడైన నిరుపేదకు పథకం ప్రభుత్వం మంజూరు చేస్తుందనే చాలా విషయాలు గ్రామస్తులు తెలుసుకునే అవకాశం రావడం కూడా విశేషం. త్వరలోనే రైతులు కష్టాలు తీరునున్నాయని, గ్రామంలోనే మంచి ప్రాధమిక వైద్యం కూడా ప్రభుత్వమే అందించే ఏర్పాటుచేస్తుందని, ఎవరూ దేనికోసమో ఎవరికోసమో, ఏ పథకమో రాదనికానీ, ఆగిపోతుందని గానీ భయపడాల్సిన పనిలేదని అందరినీ ఉత్సాహ పరుస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సత్యన్నాయుడు. ఈ ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.