అల్లూరి సాక్షిగా ఉంగరం గుర్తుతో సర్పంచ్ బరిలోకి..


Ens Balu
4
Krishnadevipeta
2021-02-09 10:06:42

మన్యం వీరుడు, విప్లవజ్యోతి, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు సాక్షిగా క్రిష్ణదేవీపేట(పాతూరు) సర్పంచ్ బరిలో ఉంగరం గుర్తుతో ప్రజల్లోకి ప్రచారానికి వెళుతున్నానని పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్) చెప్పారు. మంగళవారం గొలుగొండ మండలంలోని క్రిష్ణదేవిపేటలో తన సర్పంచ్ గుర్తుని అల్లూరి విగ్రహం వద్ద ఉంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో అరాచక బ్రిటీషుపాలనను ఎదిరించడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి రచ్చబండ పంచాయతీ పాలనకు అల్లూరి సీతారామరాజు క్రిష్ణదేవీపేట గ్రామం నుంచే శ్రీకారాం చుట్టారని..ఆ మహనీయుని స్పూర్తితో గ్రామంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించి.. గ్రామాన్ని అభివ్రుద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో తాను సర్పంచ్ అభ్యర్ధిగా బరిలో నిలబడ్డానని అన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన గ్రామంలో పుట్టిన తెలుగు బిడ్డగా మీ అందరి సహకారం కోరుతూ, నా సర్పంచ్ అభ్యర్ధి ఉంగరం గుర్తుతో ప్రచారం నిర్వహిస్తున్నానని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సహకారం తనకు ఉందని, అదే నమ్మకంతో ముందుకి సాగుతున్నట్టు చెప్పారు. తాను ఇచ్చే అన్ని హామీలకు కట్టుబడి ఉంటానని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పూర్తితో సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడిన తనకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరూ భయపడాల్సిన పనిలేదని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మంజూరు చేసే లక్ష్యంతోనే గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. దాని ద్వారా అర్హులైనవారు దరఖాస్తు చేసుకుంటే పథకాలు ఖచ్చితంగా వచ్చితీరుతాయని భరోసా ఇచ్చారు. పాతూరు గ్రామ ప్రజల కష్టానికే కాకుండా అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటానని, మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంచి.. ఉంగరం గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో సర్పంచ్ గా గెలిపించాలని సత్యన్నాయుడు ఓటర్లను అభ్యర్ధించారు. ఈ ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.