ఉంగరం గుర్తుకి ఓటువేస్తే పాతూరుకి మహర్ధశ..


Ens Balu
2
Krishnadevipeta
2021-02-09 19:20:27

ఉంగరం గుర్తుకి ఓటువేస్తే మన గ్రామానికి మహర్ధశ తీసుకు వస్తానని  క్రిష్ణదేవీపేటకు(పాతూరు) పంచాయతీ అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు) అన్నారు. మంగళవారం పాతూరు గ్రామంలోని అన్నివీధులు తిరుగుతూ ఓటర్లును నేరుగా కలిసి ఓట్లను అభ్యర్ధించారు. భారీ అభిమానుల సందోహం మధ్య ప్రచారం చాలా ఉత్సాహం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యంనాయుడు మాట్లాడుతూ, అందరివాడుగా, మీకుటుంబ సభ్యునిగా భావించి ఈ ఎన్నికల్లో తనకు పట్టం కట్టాలని, ప్రతీ ఓటరు ఉంగరం గుర్తుకే ఓటువేయాలని కోరారు. తనను గెలిపిస్తే అన్ని వార్డులను అభివ్రుద్ధిచేసి చూపిస్తానని, ఇప్పటికే వార్డులన్నీ తిరిగి ప్రధాన సమస్యలన్నీ ప్రత్యేకంగా ఒక పుస్తకంపై రాసుకున్నానని ప్రధానత్య కలిగిన సమస్యలను పరిష్కరించి గ్రామస్తులందరికీ సేవచేసుకుంటానని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మన గ్రామాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వంలో గ్రామాన్ని అందరం కలిసి అభివ్రుద్ధి చేసుకోవాలంటే దానికి ఒక్కటే మార్గమని, తనను సర్పంచ్ ని చేస్తే అభివ్రుద్ధి ఎలావుంటుందో చేసి చూపిస్తానని ప్రజలను చైతన్య పరిచారు. పందిరి అప్పారావు తర్వాత ఆయన వారసుడిగా పాతూరు గ్రామానికి సేవచేసే భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రజలు, ఓటర్లు అంతా కల్పించాలన్నారు. కేవలం మీకు సేవచేయాలనే లక్ష్యంతోనే లక్షలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని వచ్చానని, నన్న మీరంతా ఆదరించి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పటికే మహిళలు, యువత తమ మద్దతుని తెలియజేశారన్నారు. మిగిలిన వారు కూడా తనను దీవించాలని సత్యంనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఈ  ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.