6 తరువాత 7..పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు


Ens Balu
2
Krishnadevipeta
2021-02-10 12:33:46

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా శివాజీ మీకు గుర్తుందా.. ఆ సినిమాలోని డైలాగులే క్రిష్ణదేవిపేట(పాతూరు) ఎన్నికల బరి ప్రచారంలో యువత సత్యంనాయుడుకి వినియోగిస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఆరు తరువాత ఏడు..పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు అంటూ ఓటర్లను ఆలోచింప చేస్తున్నారు. ఊరిపై పేద ప్రజలను పథకాలకోసం మభ్యపెట్టి దండుకునే అభ్యర్ధి మాకొద్దు..గ్రామాన్ని సొంత నిధులతోనైనా అభివ్రుద్ధి చేసే సరైన నాయకుడే మాకు ముద్దు.. అంటూ యువత తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పుణ్యమాని అల్లూరి సీతారామరాజు చరిత్రను కూడా ఇంటింటికీ తెలియజేస్తూ..తన పోరాటం ప్రజలను పీడిస్తున్న సమస్యలపైనే వుంటుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు సత్యంనాయుడు. అన్నివర్గాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని పాతూరు ప్రజలకు తాను అండగా ఉంటానని ఎవరూ ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని చెబుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.