ఆఖరిరోజు ప్రచారం అదరగొట్టిన సత్యంనాయుడు..
Ens Balu
3
Krishnadevipeta
2021-02-11 21:08:58
విశాఖజిల్లా, గొలుగొండ మండలంలోని ప్రతిష్టాత్మక క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీ సర్పంచ్ బరిలో నిలబడిన పందిరి సత్యంనాయుడు ఆఖరిలో ప్రచారం అదరగొట్టాడు. గురువారం పాతూరులో యువత, మహిళలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సవాల మధ్య నిర్వహించిన కేన్వాసింగ్ ఎంతో సరదా సరదాగా చేపట్టారు. మహిళా అభ్యర్ధులైతే ఓటర్లను చైతన్యపరచడానికి డాన్సులు చేస్తూ, సత్యంనాయుడిని గెలిపించాలని, గ్రామాన్ని మనమే అభివ్రుద్ధిచేసుకోవాలంటూ.. ఉత్సాహంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్) మాట్లాడుతూ, గ్రామంలోని అన్ని వార్డుల్లో సమస్యలనూ తాను స్వయంగా పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకోసం ఎవరూ ఎవరిని అర్ధించాల్సిన పనిలేదని, అర్హులైనవారందరికీ తానే దగ్గరుండి సంక్షేమ పథకాలు వచ్చేలా చేస్తానన్నారు. గ్రామం కోసం, గ్రామాభివ్రుద్ధికోసం వచ్చిన తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని జిల్లా మొత్తం తొంగిచూసేలా మార్చి చూపిస్తానన్నారు. పాతూరులోని పైవీధిలోని వీరభ్రహ్మేంద్రస్వామి, శ్రీక్రిష్ణుడి ఆలయాల అభివ్రుధ్దికి సహాయం చేస్తానన్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లోనూ సిసి రోడ్లు, డ్రైనేజీలు, స్వచ్ఛమైన మంచినీరు, కమ్యూనిటీహాళ్లు అన్నింటినీ క్రమపద్దతిలో చేపడతానన్నారు. విద్యార్ధులు, నిరుద్యోగుల కోసం గ్రామంలో గ్రంధాలయం ఏర్పాటుకి క్రుషిచేస్తానన్నారు. తద్వారా అక్కడ అన్ని రకాల పుస్తకాలు ఏర్పాటు చేసి, పోటీపరీక్షలకు సిద్దమయ్యేవారికోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయిస్తానని యువతకి భరోసా కల్పించారు. ఈ ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), పందిరి శివ, పందిరి ఈశ్వరరావు, రాజు, దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక కుమారి, చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొన్నారు.