పాతూరు పంచాయతీలో వార్డుల మోత మోగింది..
Ens Balu
2
Krishnadevipeta
2021-02-13 23:02:22
విశాఖజిల్లా గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(పాతూరు) ప్రతిష్టాత్మక పంచాయతీలో నలుగురు సర్పంచ్ అభ్యర్ధులు నిలబడ్డ బరిలో వైఎస్సార్సీపీ మద్దతు దారు పందిరి సత్యన్నారాయణ( సాఫ్ట్ వేర్ఇంజినీర్ సత్యంనాయుడు) పేనల్ లో ఆరుగురు వార్డు మెంబర్లు విజయదుందుబీ మోగించారు. ఇక్కడ ఇండిపెండెంట్ పేనల్ అభ్యర్ధికి మూడు వార్డులు రాగా, టిడిపి పేనల్ అభ్యర్ధికి ఒక వార్డు సభ్యుడు గెలుపొందడం విశేషం. నేరుగా వైఎస్సార్సీపీ జెండా వేసుకొని సర్పంచ్ అభ్యర్ధిగా బరిలో నిలబడ్డ అభ్యర్ధి పేనల్ కి ఒక్కవార్డు గెలవలేకపోవడం చెప్పుకోదగ్గ విషయం. ఆది నుంచి వార్తల్లో నిలిచిన ఈ పంచాయతీ విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ఇస్తున్న అంచనా కధనాలన్నీ వాస్తవాలవుతూ వచ్చాయి. దీనితో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలపై పాఠకులకు సరైన గురి ఏర్పడింది. మిగిలిన నాలుగు వార్డుల్లోనూ స్వతంత్ర్య అభ్యర్ధి, టిడిపి అభ్యర్ధి సామాజిక పట్టుతోనే గెలిచినట్టు ఫలితాలు వెల్లడించాయి. నేరుగా వైఎస్సార్సీపీ పార్టీ జెండాతో బరిలో ఉండి నామినేషన్ల దగ్గర నుంచి పోలీంగ్ వరకూ హడావిడి చేసినా ఒక్క వార్డు గెలుచుకోకపోవడంతో.. ఈ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్ధి ఎంపిక విషయంలో మండల నేతల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రస్తుతం వార్డు మెంబర్లుగా గెలిచిన వారందరూ గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేనివారు కావడం చెప్పుకోదగ్గ అంశం..