పాతూరుకి మంచి విజయాన్ని అందించారు..


Ens Balu
3
Krishnadevipeta
2021-02-14 11:35:50

గొలుగొండ మండలంలోని క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్)కి మంచి విజయాన్ని అందించారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వార్ఢు సభ్యులను కొనియాడారు. ఆదివారం ఈ మేరకు సర్పంచ్ గా ఎన్నికైన సత్యంనాయుడుతో కలిసి వార్డు సభ్యులంతా కలిసి వెళ్లి తమ విజయాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల బరిలో నలుగురు వ్యక్తులు నిలబడినప్పటికీ సత్యంనాయుడు పేనల్ కి ఆరు వార్డు మెంబర్లు, సర్పంచ్ గా గెలిపించడం మామూలు విషయం కాదన్నారు. పోరాటాలకు పుట్టినిల్లు అయిన క్రిష్ణదేవిపేట పంచాయతీలో మరోసారి ప్రజలు ప్రత్యర్ధులపై పోరాటం చేసి మంచి అభ్యర్ధిని, పార్టీకి, ప్రజలకు పనిచేసే వ్యక్తిని సర్పంచ్ అభ్యర్ధిగా గెలిపించడం శుభపరిణామం అన్నారు. ఇదే ఉత్సాహాన్ని రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ చూపించాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని, పార్టీ అభివ్రుద్ధికి కూడా క్రుషి చేయాలని ఎమ్మెల్యే వీరందరికీ సూచించారు. అనంతరం వారితో ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడి వారిని ఉత్తేజ పరిచారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అభ్యర్ధి దుంపలపూడి సహదేవుడు, కరక కుమారి, పందిరి రామారావు, పందిరి వెంకటరమణ(ఆర్ఎంపీ బుజ్జి), పాతూరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.