పాతూరు నిశ్శబ్ధ విప్లవం..ఎమ్మెల్యేకి బహుమానం..


Ens Balu
4
Krishnadevipeta
2021-02-14 11:38:53

విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(పాతూరు) ప్రతిష్టాత్మక పంచాయతీ పోరులో నిశ్శబ్ద విప్లవం చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అభ్యర్ధులు నిలబడ్డ ఈ పంచాయతీ ఎన్నిక బరిలో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యంనాయుడు) గెలుపు ప్రత్యర్ధులను దారుణంగా మట్టికరిపించింది. ఆ విజయోత్సాహాన్ని నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కి బహుమానంగా పాతూరు నుంచి జనసందోహంగా కదిలి వెళ్లి అందించింది. ఎన్నికలో నిలబడిన దగ్గర నుంచి విజయంతోనే మళ్లీ మీ దగ్గరకి తిరిగి వస్తామని చెప్పిన మాటను నిజం చేస్తూ.. సత్యంన్నాయుడు పేనల్ వార్డు సభ్యులు, అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు జయ జయధ్వానాలు చేసుకుంటూ, ప్రజావిజయాన్ని వైఎస్సార్సీపీ పార్టీకి తెలియజేసింది. ఆది నుంచి ఈ పంచాయతీలో సత్యంనాయుడు గెలుపు పైనే ప్రత్యేక కధనాలన్నీన్యూస్ కార్డ్ గా ప్రచురిస్తూ వచ్చిన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ చెప్పినట్టుగానే సత్యంనాయుడు గెలుపు నల్లేరుమీద నడకే అయ్యింది. దీనితో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనమంటేనే పాఠకుల్లోనూ, వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తల్లోనూ ఒక ప్రత్యేక నమ్మకాన్ని కలిగించింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా సత్యంనాయుడుని ఓడించాలని చూసిన ఏ ఒక్కరి ప్రయత్నాలు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఫలించలేదు. పైగా చేసిన అన్ని సమాలోచనలు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, సమాజిక సమీకరణలు, నమ్మించి మోసం చేసిన తీరు ప్రత్యర్ధి అభ్యర్ధులనే బొక్కబోర్లా పడేలా చేశాయి. ముఖ్యంగా గ్రామంలోని యువత, మహిళలు సత్యంనాయుడికి పట్టం కట్టిన తీరు ప్రత్యర్ధుల అంచనాలకే అందలేదంటే ఈ నిశ్శబ్ధ విప్లవం ఏ స్థాయిలో మిగిలిన ముగ్గురు అభ్యర్ధులను ఓడించడానికి వ్యూహరచన చేసిందో అన్ని రాజకీయ పార్టీలకు కళ్లకు కట్టినట్టు కనిపించింది. నాడు  అల్లూరి సీతారామరాజు క్రిష్ణదేవిపేట(పాతూరు) వేదికగా తెల్లదొరలపై తిరగబడ్డట్టుగానే.. ప్రజలు కూడా సత్యంనాయుడిని గెలిపించడానికి మిగిలిన అభ్యర్ధులపై తిరగబడి మరీ చేసిన వ్యూహరచన, చాలా సైలెంటగ్ వేసిన ఓట్ల ఫలితం ఎలా ఉంటుందో నేతలకు చెప్పకనే చెప్పారు. మన్యం పితూరీలో బ్రిటీషువారిని ఎదిరించడానికి అల్లూరి సేన చేసిన  వ్యూహరచనను ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్ధి అభ్యర్ధులను తిప్పికొట్టడానికే యువత మొత్తం పుణికి పుచ్చుకున్నారా  అన్నట్టుగా  పాతూరు యువత, మహిళలు, అభిమానులు, కార్యకర్తలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యంనాయుడు గెలుపుకి ఇంతాలా పనిచేశారని రుజువు చేయగలిగింది. బరిలో నిలబడ్డ ముగ్గురు వ్యక్తులు ఓట్లు సంపాదించినా..అవి గెలవడానికి ఏమాత్రం పనిచేయకపోవడం విశేషం. ఏది ఏమైనా నిశ్శబ్ధ విప్లవం ప్రజల్లో వస్తే వార్ వన్ వన్ సైడ్ అయిపోతుందనడానికి క్రిష్ణదేవీపేటలో 2021లో జరిగిన ప్రతిష్టాత్మక పంచాయతీ ఎన్నికల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యంనాయుడు గెలుపే ఒక ప్రధాన ఉదాహరణగా జాల్లాలోనే ఒక సంచనలంగా మారింది. అంతేకాదు గొలుగొండ మండలంలోని వైఎస్సార్సీపీ కేడర్ లోనూ ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించింది..!