క్రిష్ణదేవిపేటను చక్కగా అభివ్రుద్ధి చేసుకుందాం..


Ens Balu
4
Krishnadevipeta
2021-02-14 11:56:23

క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీని, గ్రామాన్ని మరింత అభివ్రుద్ధి చేసుకుందామని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. 2021 పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్ధులను ఓడించి పార్టీకి, క్రిష్ణదేవిపేట గ్రామానికి విజయాన్ని అందించిన సర్పంచ్ అభ్యర్ధి సత్యంనాయుడు, ఇతర వైఎస్సార్సీపీ నాయకులు, వార్డు సభ్యులు, అభిమానులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రిష్ణదేవిపేట గ్రామాన్ని అన్ని రకాలుగా అభివ్రుద్ధిచేయడానికి తనవంతు సహకారం పూర్తిగా అందిస్తానని సర్పంచ్ సత్యంనాయుడుకి ఎమ్మెల్యే వివరించారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను, ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను సత్యంనాయుడు ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకువెళ్లారు. తన నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని, అదే సమయంలో క్రిష్ణదేవిపేట పంచాయతీకి ప్రత్యేకంగా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. వార్డు సభ్యులు, సర్పంచ్, గ్రామంలోని కార్యకర్తలు అంతా పార్టీ అభివ్రుద్ధికి క్రుషి చేయడంతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అందేలా చూడాలన్నారు. గ్రామాన్ని జిల్లాలోనే మంచి గ్రామంగా తీర్చిదిద్దుకునేలా మంచి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాన్ని అభివ్రుద్ధి చేసుకోగల సత్తా, యువత సహకారం, మహిళల ప్రోత్సాహం ఉన్నందున గ్రామాన్ని పంచాయతీ నిధులతో బాగుచేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సర్పంచ్ ఎన్నికలో కష్టపడిన యువతను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాతూరు నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, యువత, అభిమానులు పాల్గొన్నారు.
సిఫార్సు