ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి..
Ens Balu
3
Peddapappuru
2021-02-15 20:50:17
గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామంలో జరగనున్న ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామ పంచాయతీ పరిధి లోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం గ్రామ పంచాయతీ పరిధి లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలలో ఎవరైనా గొడవలు, అవాంఛనీయ సంఘటనలు సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత వెంటనే 4 గంటలకల్లా కౌంటింగ్ చేపట్టి రాత్రి 8 గంటల లోపు ఫలితాలు వెల్లడించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి వార్డుకు సపరేట్ గా టేబుల్స్ ను ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ ఆలస్యంగా కాకుండా త్వరితగతిన చేపట్టాలని సూచించారు. నరసాపురం గ్రామంలో పోలింగ్ కేంద్రం మార్పు విషయంలో అభ్యర్థులకు, ఓటర్ల కు తెలపాలన్నారు. సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్ ఐకి ఆదేశించారు. అనంతరం గ్రామంలో గత ఎన్నికలలో ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలన్నారు. ఎలాంటి విజయోత్సవాలు జరుపుకోరాదని జిల్లా కలెక్టర్ సూచించారు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షర్మిల, ఎంపీడీవో ప్రభాకర్, ఎస్ ఐ గౌస్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.