కరోనా మాగ్రామం విడిచిపో అంటూ గ్రామదేవతకి పూజలు


Ens Balu
2
Koyyuru
2020-08-16 19:15:00

’కరోనా మహమ్మారి..మా గ్రామం నుంచి విడిచిపోమరి’ అని వేడుకొంటూ ఆదివారం మండలంలోని శరభన్నపాలెం గ్రామస్థులు గ్రామదేవతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామంలో ఇటీవల వరసగా కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతుండటంతో ఆందోళనకు గురైన గ్రామస్థులు, ఊరిపొలిమేరవద్ద ఉన్న గ్రామదేవతకు పసుపునీటిని వారధిగాపోసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా వైరస్ గిరిజన గ్రామాల్లో ప్రబలడం వలన, తెలిసీ తెలియని వారు ఈ రోగం భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్‌ను గ్రామం నుంచి పారద్రోలి,మరలా రాకుండా నిరోధించాలని గ్రామదేవతను వేడుకొన్నారు. అంతేకాకుండా తమ గిరిజన గ్రామాలపై ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని శరభన్నపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. కార్యక్రమంలో పెద్దలు దారకొండ నారాయణమూర్తి, ఎన్‌.‌జానకిరావు, పండాసత్తిబాబు, సాతాసత్యనారాయణ, ఎస్‌.‌జోగిరాజు, ఎల్‌.‌శివప్రసాద్‌, ఎల్‌విఎస్‌గాంధీ, ఎన్‌.‌చంద్రశేఖర్‌, ‌బి.శ్రీధర్‌ అలాగే అల్లూరియూత్‌సభ్యులు తదితరులు పాల్గొన్నారు.