పాస్ లు ఉన్నవారికే వి.ఐ. పి దర్శనం..


Ens Balu
3
Srikakulam
2021-02-16 17:13:26

శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు వి.ఐ. పి పాస్ లు ఉన్నవారికే వి.ఐ.పి దర్శనం ఉంటుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేసారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఈ నెల 19వ తేదీన రథసప్తమి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 18వ తేదీ రాత్రి 12 గంటల నుండి వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 18వ తేదీ రాత్రి 2 గంటల నుండి వి.ఐ.పి దర్శనం ప్రారంభం అవుతుందని కలెక్టర్ పేర్కొంటూ వి.ఐ.పి దర్శనానికి వచ్చే వారి వివరాలను ముందుగా రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ)కు అందించి పాస్ లు పొందాలని విజ్ఞప్తి చేసారు. వి.ఐ.పి క్యూ లైన్ లో అనేక మంది రావడంతో నిజమైన వి.ఐ.పిలకు, డోనర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ నేపధ్యంలో వి.ఐ.పి పాస్ లను ప్రవేశపెట్టడం జరిగిందని స్పష్టం చేసారు. వి.ఐ.పి పాస్ లు సకాలంలో పొందుటకు ముందుగానే ఆర్.డి.ఓ కు వివరాలు సమర్పించాలని అన్నారు. పాస్ లు లేనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేసారు.