ఏజెన్సీలో నిర్విరామ వర్షం-స్థంభించిన జనజీవనం


Ens Balu
2
koyyuru
2020-08-16 20:01:12

విశాఖ ఏజన్సీలో గద వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కనీసం ఒక్క గంటపాటు కూడా విరామంలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.  కరోనా వైరస్‌ ‌ప్రభావంతో నిర్మానుష్యంగా మారిన బహిరంగప్రదేశాలు ఇప్పుడు ఎడతెరిపిలేని వర్షాలతో మరింత బోసిపోయి కనబడుతున్నాయి. తుఫాన్‌ ‌ప్రభావంతో గతమూడు రోజులుగా వర్షాలు మరింత ఎక్కువయ్యాయి. రోజుకు సుమారు 11సెంమీ.. నుండి 12సెంమీల వరకూ వర్షం నమోదు అవుతుంది. ఈ వర్షాల ప్రభావతో వ్యాపారాలు లేక వ్యాపారులు విచారం వ్యక్తం చేస్తుండగా, వ్యవసాయ పనులు కూడా సక్రమంగా సాగడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని రేవడివీధి గ్రామానికి నిర్మించిన గ్రావెల్‌రోడ్డు పూర్తిగా దమ్ముపట్టిన పొలంగా మారిపోగా, మంప-కించవానిపాలెం మద్య నిర్మాణంలో ఉన్న వంతెన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆదివారమైతే కించవానిలెం కాలువ నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రజలు రేవళ్ల మీదుగా మండలకేంద్రానికి చేరుకంుటున్నారు. కాలువలు పొంగిప్రవహిస్తున్నాయి. యు.చీడిపాలెం పంచాయితీ పలకజీడి మార్యంలోని బండిగెడ్డవద్ద రోడ్డుపైనుండి కాలువ ప్రవహించడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. విద్యుత్‌ ‌సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడి వినియోగదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.