పౌష్టికాహారం పూర్తిస్థాయిలో పిల్లలకు అందాలి..


Ens Balu
2
Krishnadevipeta
2021-02-17 14:04:53

ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీస్త్రీలు, చిన్నపిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందేలా చూడాలని క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు) పేర్కొన్నారు. బుధవారం పాతూరు ఎస్సీకాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు టిహెచ్ఆర్ ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల్లో రక్తహీనతను తొలగించేందుకు ఈ పౌష్టికాహారం పంపిణీ చేస్తుందని అన్నారు. అది అందరికీ అందినపుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ముఖ్యంగా గర్భిణీలలో రక్తహీనత లేకుండా ప్రభుత్వం ఇచ్చే కిట్ లను పూర్తిగా తిని ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీలు వారిని చైతన్యవంతం చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సురక్షిత కాన్పులకు గర్భిణీలను దగ్గరుండి ఆరోగ్య సిబ్బంది తీసుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా నిరుపేద గర్భిణీలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ఉంటారన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం గర్భిణిలు ఎంత వరకూ తీసుకుంటున్నారు, వారికి శరీరంలో రక్తంలోని హెచ్ బీ శాతం ఎంతుంతో జాగ్రత్తగా చూడాలన్నారు. ఏ ఒక్క గర్భిణీ ఎనిమిక్  కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయ మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్త సత్యవతి,వార్డు సభ్యులు వానపల్లి నవ్యరత్నం, కరకకుమారి, చింతలరాము,ఆరుగుళ్ల అర్జునమ్మ,గళ్లా సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.