పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించాలి..


Ens Balu
3
Krishnadevipeta
2021-02-17 14:39:07

ప్రజాసేవే పరమావధిగా మన కొత్త కార్యవర్గం ప్రతిష్టాత్మక గ్రామసచివాలయ వ్యవస్థలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించి జిల్లాలోనే ఉత్తమ పంచాయతీ పేరు తెచ్చుకోవాలని సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు) పిలుపు నిచ్చారు. గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీలో నూతనంగా గెలిచిన సర్పంచ్ ఇతర కార్యవర్గ పరిచియ కార్యక్రమం సచివాలయంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. సుమారు పదేళ్ల తరువాత జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా గెలుపొందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ, ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు, వార్డు సభ్యులను సచివాలయల కార్యదర్శి  కిరణ్మయి కార్యాలయంలోని సిబ్బందికి పరిచియం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పందిరి సత్యన్నారాయాణ(సత్యంనాయుడు) మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించాలనే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో ఏర్పాటు చేసి గ్రామసచివాలయ వ్యవస్థలో కొత్త పాలక వర్గంగా పనిచేసే తొలి అవకాశం మనకే వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. అందరు వార్డు సభ్యులు, గ్రామసచివాలయ సిబ్బంది కలిసి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి క్రుషి చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా సేవలందించాలన్నారు. మన పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అందరం సమిష్టిగా పనిచేయాలన్నారు. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చే అర్జీలను కూడా సచివాలయంలో అన్నిశాఖల సిబ్బంది ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. మీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తమ ద్రుష్టికి తీసుకు వస్తే, మండల, జిల్లా స్థాయి అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  పంచాయతీ వార్డు సభ్యులు వానపల్లి నవ్యరత్నం, కరకకుమారి, చింతలరాము,ఆరుగుళ్ల అర్జునమ్మ,గళ్లా సత్యన్నారాయణ, పి.చిన్నమ్మలు, ఎం.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.