ఇంటింటికీ రేషన్ సద్వినియోగం చేసుకోవాలి..
Ens Balu
3
క్రిష్ణదేవిపేట
2021-02-17 14:44:11
ప్రభుత్వం వినియోగదారులకు ఇంటింటికీ తీసుకు వచ్చి ఇస్తున్న రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్రిష్ణదేవీపేట(పాతూరు) సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు) పిలుపునిచ్చారు. బుధవారం పాతూరు గ్రామంలోని ఇంటింటి రేషన్ పంపిణీ కార్యాక్రమాన్ని ప్రారంభించి అనంతరం సరుకులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యంనాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సౌకర్యార్ధం ఇంటివద్దే రేషన్ సరుకులు అందించే గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. దీని ద్వారా పూర్తికొలతలతో సరుకులు ప్రజలకు అందుతాయన్నారు. శ్రమకోర్చి రేషన్ షాపుల దగ్గరకి వెళ్లే ఇబ్బందులు తగ్గుతాయన్నారు. రేషన్ పంపిణీ వాహనం సైరన్ వినపడగానే ఏ వీధిలోవారంతా ఆ వీధిలో ఒకేసారి సరుకులు తీసుకోవచ్చునన్నారు. ఈ మంచి వ్యవస్థను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో తూనికల్లో తేడాలు వచ్చినా కూడా నిర్వహాకులను ప్రశ్నించవచ్చునన్నారు. లేదంటే తమకైనా ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు, పంచాయతీ వార్డు సభ్యులు వానపల్లి నవ్యరత్నం, కరకకుమారి, చింతలరాము,ఆరుగుళ్ల అర్జునమ్మ,గళ్లా సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.