నూనత సర్పంచ్ కి ఉపాధ్యాయుల సత్కారం..


Ens Balu
2
Krishnadevipeta
2021-02-17 15:52:29

గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు)ని బుధవారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ సత్యంనాయుడిని స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పివి రమణ హెచ్ఎం, ఎల్.ఆదిలక్ష్మి, ఎస్.శ్రీనివాసరావు, ఎస్.రాణి, ఎం.సద్గుణ తదితరులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా  కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులను హెచ్ఎం పివిరమణ సర్పంచ్ సత్యంనాయుడుకి పరిచియం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యంనాయుడు మాట్లాడుతూ, క్రిష్ణదేవి పేట పాఠశాల మండలంలోనే మంచి పాఠశాలగా పేరుతెచ్చుకునే విధంగా విద్యాభోదన చేపట్టాలని ఉపాద్యాయులను కోరారు.  సుమారు పదేళ్ల తరువాత మళ్లీ క్రిష్ణదేవిపేటకు యువ సర్పంచ ఎన్నిక కావడం అభినందనీయమని, తమ సహాయ సహకారాలు కార్యవర్గానికి అందిస్తామని, అదే సమయంలో పాఠశాల అభివ్రద్ధికి కూడా సహకరించాలని ఉపాధ్యాయులు సర్పంచ్ ను కోరారు. కార్యక్రమంలో మద్యాహ్న భోజన పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.