ఏజెన్సీ గ్రామాల్లోనూ పోలీంగ్ ప్రశాంతం..


Ens Balu
2
Maredumilli
2021-02-17 17:52:47

తూర్పుగోదావరి జిల్లా  మారేడుమిల్లిలో బుధవారం ఉదయం 10 గంటలకు ఏజెన్సీ పరిధి లో  మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కు సంబంధించి 30 శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల జిల్లా పరిశీలకులు హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. బుధవారం మారేడుమిల్లిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కు సిబ్బంది  సకాలంలో విధులకు హాజరై ఉదయం 6:30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారని మొదటి గంటలో పోలింగ్ శాతం కొంతమేరకు తక్కువ   గా ఉన్నప్పటికీ 10 గంటల కు 30 శాతంగా నమోదైనట్లు ఆయన తెలిపారు.రాబోయే మూడున్నర గంటల్లో 70 లేదా 80 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.పోలీసులు మారుమూల గిరిజన తండాలు గ్రామంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహణ జరుగుతోందని ఆయన వెల్లడించారు మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని సుమారు నాలుగు గంటలకు ఫలితాలు రావచ్చునని ఆశిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని ఆయన తెలిపారు.ఆయన తొలుత మండల పరిధిలోని పుల్లంగి,బోదు లూరు,కుట్ర వాడ, మారేడుమిల్లి,దేవరపల్లి గ్రామ పంచాయతీల్లో పోలింగ్ సరళిని పరిశీలించి పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు ఉన్నాయా? అని పోలీసు సిబ్బందిని పోలింగ్ ఏజెంట్ లను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలే దని వారు ఆయనకు తెలియజేశారు.